8 వందల మీటర్ల పైబడి వెనక్కి
సిరా న్యూస్,పిఠాపురం;
నిత్యం సముద్రపు అలలతో ఎగసిపడే ఉప్పాడ సముద్రం సందర్శికులు బీచ్ లో ఉండగానే ఒక్కసారిగా వెనక్కి వెళ్ళింది. సోమవారం సాయంత్రం కాకినాడ జిల్లా పిఠాపురం నియోజవర్గం యు కొత్తపల్లి మండలం ఉప్పాడ సముద్రం ఒక్కసారిగా సుమారు 8 వందల మీటర్లు వెనక్కి వెళ్ళింది. దీంతో అటుగా వెళ్లే ప్రయాణికులు, బీచ్ సందర్శకులు ఒక్కసారిగా అవ్వకపోతున్నారు. నిత్యం ఎగసిపడుతూ బీచ్ రోడ్డుపై చేరుకునే అలల తాకిడి లేకపోవడంతో ప్రయాణికులు, స్థానిక మత్స్యకారులు,.బీచ్ సందర్శకులు సముద్రం వెనక్కి వెళ్లిందంటే రానున్న రోజుల్లో మరింత విపత్తు సంభవించే సందర్భం ఉండవచ్చని తెలుపుతున్నారు.సుబ్బంపేట, ఎస్ పి జి ఎల్ శివారు వద్ద సముద్ర తీరం వెనక్కి వెళ్లడంతో ఒకపక్క భయాందోళన గురైనప్పటికీ,,అదే చోట మత్స్యకార పిల్లలు తీరం వద్దఆటలాడుకుంటు న్నారు.ఒకపక్క తుఫాను,ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు. సముద్రం నీటిమట్టం పెరుగుదల కల్పించాలని,అలాంటిది సముద్రం వెనక్కి వెళ్లడం ఆశ్చర్యానికి గురిచేస్తుందని పలువురు మేధావులు తెలియపరుస్తున్నారు. సముద్రం వెనక్కి వెళ్లిన చోట గతంలో ఎప్పుడు వెళ్లలేదని స్థానికులు చెబుతున్నారు.. ఒకవేళ ఆటుపోటుల వల్ల ఇలా జరిగిందా మరి ఏమైనా విపత్తు సంభవిస్తుందా అన్న కోణాల్లో ఆలోచనలో పడ్డారు. ఏదేమైనా సముద్రం వెనక్కి వెళ్లడంతో స్థానిక మత్స్యకారులు, ప్రజలు, సందర్శికులు భయభ్రాంతులకు గురవుతున్నారు.