సిరా న్యూస్,పిఠాపురం;
ఏలేరు ప్రాజెక్ట్ నుండి నీటి విడుదల కారణంగా పిఠాపురం నియోజకవర్గం ముంపుకు గురైన ప్రాంతల్లో ఇబ్బందులు పడుతున్న బాధితులకు రూరల్ ఎస్ ఆర్ ఎం టి ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సహకారంతో షీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు ఐదు లక్షల రూపాయలు విలువచేసే నిత్యావసర సరుకులను పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మర్రేడి శ్రీనివాస్ సమక్షంలో పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ కాకినాడ రూరల్ నుండి బాధితులకు సహాయం అందిస్తున్న ఎస్ ఆర్ ఎం టి ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, షీ ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు.అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ వరద బాధితులను ఆదుకోవడానికి చేతనైనంత సహాయాన్ని అందించడానికి అందరం ముందుకు రావాలని కోరారు.మానవత్వం ప్రదర్శించాల్సిన సమయము ఇది అని అందులో భాగంగానే తమ వంతు సహాయంగా వరద బాధితులకు నిత్యవసర వస్తువులను అందించడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.