నాకు న్యాయం చేయండి..

సిరా న్యూస్,తాండూరు;
బషీరాబాద్ పోలీస్ స్టేషన్ నందు పెట్రోల్ డబ్బాతో గిరిజన మహిళ ఆత్మహత్యయత్నం చేసింది. నాకు న్యాయం చేయండీ అంటూ ఓ గిరిజన మహిళ పోలీస్టేషన్ మెట్లు ఎక్కింది. పెట్రోల్ డబ్బా వెంట తెచ్చుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన బషీరాబాద్ పోలీస్టేషన్ వద్ద చోటు చేసుకుంది. బాధితురాలి కథనం మేరకు.. బషీరాబాద్ మండలం కొత్లాపూర్ గ్రామానికి చెందిన దేవీబాయికి ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. చాలా ఏళ్ల క్రితం దేవీబాయి భర్త చనిపోయాడు. అయితే దేవీబాయి నాలుగు నెలల క్రితం తన పెద్ద కూతురును అదే గ్రామానికి చెందిన యువకుడితో పెళ్లి జరిపించింది. అప్పటికే కూతురుకు కంసాన్పల్లి తాండాకు చెందిన యువకుడితో ప్రేమ వ్యవహారం కొనసాగుతోంది. పెళ్లి అయిన కొన్ని రోజుల తరువాత కూతురు ప్రేమికుడితో వెళ్లిపోయింది. ఆ తరువాత కూతురు, ప్రేమికుడిని పిలిపించి ఇరు కుటుంభ సభ్యులతో కుల పంచాయతీని పెట్టారు. ఈ పంచాయతీలో భర్త కుటుంబికులు ప్రేమికుడి నుంచి రూ. 14లక్షల పరిహారం ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారు. ఇందుకు ప్రేమికుడు రెండు నెలల గడువులో భర్త కుటుంబానికి ఇస్తానని అంగీకరించారు.
ఇచ్చిన సమయం దాటినా కూడా ప్రేమికుడు డబ్బులు ఇవ్వక పోవడంతో కూతురు భర్త కుటుంభీకులు దేవీబాయిపై ఒత్తిడి తీసుకవచ్చారు. ఈ క్రమంలో తనకు న్యాయం చేయాలంటూ దేవీబాయి బషీరాబాద్ పోలీస్టేషన్కు వచ్చింది. వెంట పెట్రోల్ బాటిల్ తీసుకవచ్చి ఆత్మహత్యాయత్నానికి యత్నించింది. గమనించిన పోలీసులు డబ్బా తీసుకుని దేవీబాయిని సముదాయించారు. ఇరు కుటుంబ సభ్యులను పిలిపించి మాట్లాడుతామని ఎస్ఐ గఫార్ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *