సిరా న్యూస్,సికింద్రాబాద్;
మూసి నిర్వాసితులకు ఖార్కానలోని రెండు పడక గదుల ఇళ్లను అప్పగిస్తున్నారన్న సమాచారంతో మడ్ ఫోర్డ్ రెండు పడక గదుల ఇళ్ల సముదాయం వద్ద స్థానికులు ఆందోళన కు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. స్థానికంగా ఉన్న లబ్ధిదారులకు రెండు పడక గదులు కేటాయించకుండా మూసి నిర్వాసితులకు ఇవ్వడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసి నిర్వాసితుల కోసం రెవెన్యూ అధికారులు వచ్చి ఇల్లను సర్వే చేసి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ఇప్పటికే మూడేళ్లు గడుస్తున్న స్థానికంగా ఉన్న తమకు ఇల్లులు కేటాయించలేదని బయట వ్యక్తులకు ఇల్లు కేటాయిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ధర్నాకు కూర్చున్న స్థానిక ప్రజలకు భాజపా నాయకుడు బీఎన్ శ్రీనివాస్ మద్దతు తెలిపి స్థానికులకే ఇళ్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ మాదిరిగా అవకతవకలు జరగకుండా స్థానికులకే కేటాయించాలని కోరారు. టిఆర్ఎస్ నాయకురాలు నివేదిత సైతం ధర్నాలో పాల్గొని వారికి న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు.