ఎమ్మెల్యే బలాల
సిరా న్యూస్,హైదరాబాద్;
మూసీ పరివాహక ప్రాంత బాధితులoదరికి డబుల్ బెడ్ రూంలు కేటాయించి పునరావాసం కల్పించాకే తరలింపు చేపడుతున్నారని మలక్ పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాల అన్నారు.చాదర్ ఘాట్ శంకర్ నగర్ మూసా నగర్ మూసీ పరివాహక ప్రాంతాలను సందర్శించి బాధితులకు భరోసా కల్పించారు. బాధితులకు అండగా తాను ఉంటానని. ఆందోళన చెందవద్దని కోరారు. భవిష్యత్తు లో ఇబ్బందులు రాకుండా మూసీ చుట్టూ గోడ ఏర్పాటు చేయనున్నారని వివరించారు.
2003 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలోనే సర్వే నిర్వహించి మార్కింగ్ చేశారని గుర్తు చేశారు అ సర్వే ప్రకారం మూసి పరివాహక ప్రాంతాలు అభివృద్ధి చేస్తే బాధితులకి నష్టం తక్కువ జరుగుతుందనేసి ఎంఐఎం నేతలు ప్రభుత్వ పెద్దలతో కలిసి వినత పత్రాన్ని అందజేశామని చెప్పారు. ప్రజలకి ఎలాంటి కష్టాలు వచ్చినా మేము ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
========================