సిరా న్యూస్,శ్రీకాకుళం;
జిల్లాలోని పలాస కేటి రోడ్డులో ఎస్సార్ షాపింగ్ మాల్ సమీపంలో బైక్ పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని దుండగులు. రోడ్డు పై నడిచి వెళ్తున్న చిత్త రెడ్డి సంతోషి అనే జీడిపిక్కల కార్మికురాలి మెడలోని రెండు తులాల బంగారు పుస్తెలు తాడు లాక్కొని పరారయారు. పుస్తెలు కింద పడపోగా బంగారు గొలుసు లాక్కెళ్లారు. బాధిత మహిళ లబోదిబో మంటూ కాశీబుగ్గ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, అక్కడకు చేరుకొని దర్యాప్తు చేసుకుని, దొంగల కోసం గాలింపు చేస్తున్నారు.