సిరా న్యూస్,నిజామాబాద్;
బోధన్ లో దారుణం జరిగింది. పది నెలల శిశువును కుక్కలు ఎత్తుకెళ్లాయి. ముల్ల పొదల్లో శిశువు అవశేషాలు లభ్యం అయ్యాయి. బస్టాండ్ ఆవరణలో యచకురాలు ఒడిలో నిద్రిస్తున్న శిశువును కుక్కలు ఎత్తుకెళ్లాయి. శిశువు అపహరణకు గురైనట్లు తల్లి పోలీసు లకు ఫిర్యాదు చేసింది. ఘటన ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. పోలీసులు విచారణ చేస్తున్నారు. బోధన్ న్ పట్టణంలో కుక్కల బెడద ఎక్కువైంది. ఇటీవల కుక్కల దాడిలో 10 మందికి గాయాలు అయిన సంగతి తెలిసిందే.