సిరా న్యూస్,విజయవాడ;
రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఎన్టీఆర్ జిల్లా అతలాకుతలమైంది. పెనుగంచిప్రోలు గ్రామంను తీవ్రంగా వరదలు ముంచెత్తాయి. వరదల ధాటికి ఇళ్లు కొట్టుకుపోయి.. ప్రజలు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. వీరి కష్టాలు చూసి చలించిన పలువురు మానవతావాదులు వీరికి సహాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. స్వచ్ఛంద సంస్థల సాయంతో వరద బాధితులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నారు. హైదరాబాద్ కు చెందిన సంసేషనల్ సంస్థ ఎండి తాల్లూరి సతీష్ కుమార్ తమ వంతు సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. పెనుగంచిప్రోలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చింతల సీతారామయ్య సహాకారంతో పెనుగంచిప్రోలు గ్రామంలో 500 మందికి.. నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. బాధలో ఉన్న వారికి సహాయం చేయడం ఎంతో గర్వంగా ఉందని సంసేషనల్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. మరింత మంది సహాయం చేయడానికి ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.