సిరా న్యూస్;
ప్రతిపక్షాలు వరదల పై బురద రాజకీయాలను మానుకోవాలి
హై0డ్రా పెట్టిందే కబ్జాదారుల ఆటకట్టించడానికి…
మల్కాజ్ గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు
నాయుడుపేట, జలగంనగర్ వరద బాధితులకు నిత్యావసరాల పంపిణీ
మంత్రి పొంగులేటి శీనన్న చొరవతో ఖమ్మం మున్నేరు నిర్వాసితులందరికీ ఇళ్ల స్థలం లేదా డబుల్ బెడ్ రూం ఇళ్లు వస్తాయని, వరదలపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న బురద రాజకీయాలు మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు, మల్కాజ్ గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను ప్రవేశపెట్టిందే కబ్జాదారుల ఆటకట్టించడానికి అని తెలిపారు. ఖమ్మం రూరల్ మండలం నాయుడుపేట, జలగం నగర్ లోని వరద బాధితులకు మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తో కలిసి నిత్యావసరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం అడ్డగోలు అనుమతులు ఇవ్వడం ద్వారానే అనేక మంది పేదలు ఈనాడు వరద బాధితులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీలు ప్రత్యక్షంగా వచ్చి పేదల బాధలను చూసి చేతనైనా సాయం చేయాలని హితవు పలికారు. అంతే తప్ప వరదలను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయొద్దని సూచించారు.