సిరాన్యూస్, ఓదెల
మల్లిఖార్జున స్వామి దేవాలయంలో ఉచిత గుండె వైద్య శిబిరం : డాక్టర్ దీక్షిత్
కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో బుధవారం పెద్దపెల్లి జిల్లా ఓదెల మల్లిఖార్జున స్వామి దేవాలయ ఆవరణలో దేవాలయ సిబ్బందికి ఉచిత గుండె వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి శిబిరాన్ని ఓదెల కాంగ్రెస్ పార్టీ మండల అద్యక్షుడు మూల ప్రేమ్‌సాగర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ ఆళ్ల సుమన్‌రెడ్డి లు ప్రారంభించారు. ఈ శిబిరంలో 150 మందికి బీపీ, షుగర్, ఈసీజీ, 2డి ఎకో మొదలగు సూపర్ స్పెషాలిటీ వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఆసుపత్రి డాక్టర్ దీక్షిత్ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ ఆలయసిబ్బందికి, స్థానిక ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతోనే ఈ వైద్య శిబిరం నిర్వహించామన్నారు. అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని ఉచితంగా అందించినందుకు కరీంనగర్ మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఈవో సుధాకర్, సీనియర్ అసిస్టెంట్ ముద్దసాని కుమారస్వామి, ఆలయ ప్రధాన అర్చకులు వీరభద్రయ్య ఆసుపత్రి సిబ్బంది బి. హారీష్, శ్రీనివాస్ ఆలయ అర్చకులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.