సిరాన్యూస్, నిర్మల్
డా.నీలిమ వేణుగోపాలకృష్ణ దంపతులకు ఘన సన్మానం
ప్రముఖ వైద్యులు, కవి, కళాకారులు డా.వేణుగోపాలకృష్ణ ఉత్తమ సేవలందించినందుకు గాను పలు జాతీయ, రాష్ట్ర, జిల్లా అవార్డులు, పురస్కారాలు పొందారు. అలాగే ప్రేమతో నాన్న ఉత్తమ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ,దర్శకుడిగా, ఆయన కూతురు సుహాసిని ఉత్తమ నటిగా నంది పురస్కారాలు పొందారు. ఆయన సతీమణి డా.నీలిమ ప్రైవేట్ వైద్యురాలిగా మంచి సేవలు అందిస్తున్నారు. ఈసందర్బంగా శనివారం నిర్మల్ జిల్లా కేంద్రంలో బుధవార్పెట్ హనుమన్ మందిరం వద్ద దేవి నవరాత్రి ఉత్సవాల్లో డా.నీలిమ వేణుగోపాలకృష్ణ దంపతులు పాల్గొన్నారు. అనంతరం ఉత్సవా కమిటీ సభ్యులు డా.నీలిమ వేణుగోపాలకృష్ణ లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఉత్సవా కమిటీ అధ్యక్షులు అదుముళ్ల నరేందర్, సభ్యులు గంట రాజేష్, రాకేష్, అయీటి రాజు, అదుముళ్ల రమేశ్,వినోద్,సంపత్,నరేష్,అదుముళ్ల ఉదయ్ చంద్ర, విశాల్, అరవింద్,అభి,ప్రవీణ్,రాజు, ప్రశాంత్, అంజి,, స్త్రీ మూర్తులు, మాతలు,తదితరులు పాల్గొన్నారు.