సిరాన్యూస్, చర్ల
ప్రతి ఒక్కరూ పౌష్టికాహారం తీసుకోవాలి : డాక్టర్ శ్రీధర్
పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ప్రతి ఒక్కరు పౌష్టికాహారం తీసుకోవాలని డాక్టర్ శ్రీధర్ అన్నారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చర్ల మండల కేంద్రంలోని కొయ్యూరు పీహెచ్‌సీలో రైస్ పేట సబ్ సెంటర్ గర్భిణీల అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు. వారికి అవసరమైన టాబ్లెట్లు ఇచ్చి, గర్భిణీ లు తీసుకోవలసిన ఆహారం, విశ్రాంతి, వ్యాయామం గురించి అవగాహన కల్పించారు.అనంతరం కొయ్యూరు లో జరుగుతున్న టువంటి ర్యాపిడ్ ఫీవర్ సర్వే ను సందర్శించి డాక్టర్ శ్రీధర్ తగు చూచనలు చేశారు. కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రమాదేవి, హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ వేణుగోపాలకృష్ణ, హెల్త్ సూపర్వైజర్ కనకదుర్గ, రాంప్రసాద్, స్టాఫ్ నర్స్ సరస్వతి, మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ శిరీష, హెల్త్ అసిస్టెంట్ సరస్వతి, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.