సిరా న్యూస్, కడెం:
పథకాలు నేరుగా ప్రజలకు అందాలనే ఉద్దేశ్యంతోనే
ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు నేరుగా అర్హులైన ప్రజలందరికి అందాలనే ఉద్దేశ్యంతోనే, ప్రభుత్వం ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరిస్తోందని డీఆర్డీవో విజయలక్ష్మీ అన్నారు. మంగళవారం నిర్మల్ జిల్లా కడెం మండలంలోని కొండుకూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులు, నాయకులతో కలిసి ప్రజలు సమర్పించిన దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభయాస్తం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రేస్ నాయకులు దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన ప్రజలకు బాసటగా నిలిచారు. వారికి దరఖాస్తు ఫారాలు నింపడంలో సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో తహాసీల్దార్ రాజేశ్వరి, స్థానిక సర్పంచ్ గొల్ల వేణు, ఎంపిటీసీ జీవన్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి అరుణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు పొద్దుటూరి సతీష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.