సిరా న్యూస్, తలమడుగు:
ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌తో కలిసి పూజా కార్యక్రమాల్లో..
తలమడుగు మండల బీఆర్‌ఎస్ నాయకులు ఆదిలాబాద్ జిల్లా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌తో కలిసి పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మంగళవారం నేరడిగొండ మండలంలోని ఎమ్మెల్యే స్వగ్రామమైన రాజురాలోని జగదాంబదేవి, సేవాలాల్ మహారాజ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పుడుపు కేదారేశ్వర్ రెడ్డి, వామన్ ప్రధాన్, రాగి రాంకిషన్, తోట శ్రీనివాస్, సోనులే కిషన్, జనార్ధర్ వాడ్గురే, తదితరులు పాల్గొన్నారు.