సిరాన్యూస్, ఆదిలాబాద్
సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తే చర్యలు : డీఎస్పి ఎల్ జీవన్ రెడ్డి
సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ డీఎస్పి ఎల్ జీవన్ రెడ్డి అన్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పి ఎల్ జీవన్ రెడ్డి మాట్లాడారు. ఆరు నెలల క్రితం ఆదివాసి మహిళ సాధారణ మరణం పై ప్రస్తుతం కొందరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం మార్చి నెలలో జరిగిన సంఘటనలపై ప్రస్తుతం వీడియోలను ఫోటోలను తీస్తూ, దుష్ప్రచారం చేస్తూ ఉన్న వీడియోలను ఇతరులకు పంపిన ఫార్వర్డ్ చేసిన, గ్రూపు అడ్మిన్ లపై, ఫార్వర్డ్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.బోథ్ పీహెచ్‌సీలో గత మార్చి నెలలో కుటుంబ నియంత్రణ శస్ర్త చికిత్స చేయించుకున్న ఆదివాసీ మహిళ డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. మార్చి 31న మహిళ అనారోగ్యంతో మరణించిందని సివిల్ అసిస్టెంట్ సర్జన్ ద్వారా పోస్టుమార్టం నివేదికలో తేలిందని తెలిపారు. కొందరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం అసత్య ఆరోపణలతో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారన్నారు. వీరిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.