సిరా న్యూస్,వరంగల్;
వరంగల్ రీజియన్ లో ఆర్టీసీకి రికార్డ్ స్థాయిలో ఆదాయం వచ్చింది. అక్టోబర్ 01 నుండి 14 వరకు 28.99 లక్షల రూపాయల ఆదాయం చేకూరింది. వరంగల్ రీజియన్ పరిధిలో కేవలం 14 రోజుల్లో ఇంత రికార్డు స్థాయి ఆదాయం ఇదే ప్రథమమని అధికారులు అంటున్నారు. వరంగల్ రీజియన్ లోని తొమ్మిది డిపోల పరిదిలో 850 ప్రత్యేక బస్సులు నడిపారు.