సిరాన్యూస్, ఓదెల
కార్మికులు ఉచిత ఆరోగ్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి : సీఎస్‌సీ సిబ్బంది రాకేష్
కార్మికులు ఉచిత ఆరోగ్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీఎస్‌సీ సిబ్బంది రాకేష్ అన్నారు. బుధవారం పెద్దపల్లి జిల్లా ఓదెల గ్రామపంచాయతీ వద్ద లేబర్ కార్డు ఉన్న25 మంది కి పరీక్షలు నిర్వహించారు. సీఎస్సీ ద్వారా పరీక్షలు చేస్తున్న సిబ్బంది రాకేష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లేబర్ కార్డు ఉన్నవారికి రక్తం, మూత్రం, థైరాయిడ్, షుగర్ వంటి 40 రకాల పరీక్షలు ఉచితంగా చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో నౌండ్ల రాకేష్ పల్లె మనోహర్ తదితరులు ఉన్నారు.