సిరా న్యూస్,విశాఖపట్నం;
విశాఖలో ధునిచి నృత్యం తో బెంగా లీలు పూజలు నిర్వహిం చి ఆహ్లా దభరిత వాతావరణంలో సందడి చేశారు. విశాఖలో ఉంటున్న బెంగా లీలతో పాటు ఇతర రాష్ట్రా నికి వచ్చిన బెంగాలీలు కూడా దస రా వేడుకలు అంగరంగ వైభవంగా జరుపున్నారు. దసరాలో దుర్గమ్మ పూజ అంటే బెంగాలీకు స్పెషల్. ప్రపంచం నలుమూల నుండి ఒకే చోట చేరి కుటుంబం అంతా కలిసి ఈ దసరా పండుగ అమ్మవారు వద్దపూజలు జరుపుకుంటారు. సరదాగా కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. ముఖ్యం గా ఉత్సవాల్లో వారి నృత్యాలు ఈ వేడుకలకు హైలెట్ గా నిలుస్తాయి. దుర్గమ్మ పూజ అంటే బెంగాలీలు ధునిచి నృత్యం అనాదిగా వస్తున్న ఆచారం అని నిర్వాహకులు అంటు న్నారు. సాంప్రదాయం వస్త్రాలు కుర్తాలు చీరలు ధరించి , పురుషు లు స్త్రీలు కలిసి డాక్ శబ్దంతో ఈ నృత్యం చేయడం సంప్రదాయంగా కొనసాగుతోంది.ఈ సారి కూడా ధూమ్ ధామ్ గా వేడుకలు నిర్వ హించి వారి భక్తిని చాటుకున్నారు.