లోకేష్ యువగళంకు బ్రహ్మరథం
నోటికి వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు
టీడీపీ మాజీ ఎమ్మెల్యే వనమాడి
సిరా న్యూస్,కాకినాడ;
కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తన మూడు కుటుంబాల గురించి గొప్పలు చెప్పుకుంటున్నారని ఆ మూడు తరాలది అక్రమాలు, అన్యాయాలు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేశారని వారి నుండి కాకినాడ ప్రజలను రక్షించడమే ధ్యేయంగా నగరంలో ఉన్న టీడీపీ శ్రేణులు పనిచేస్తున్నాయని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) పేర్కొన్నారు. ద్వారంపూడి మొదటి, రెండు, మూడో తరం వాళ్లు నల్లమందు, దొంగ నోట్లు, గంజాయి, నోట్ల మార్పిడి అక్రమ బియ్యం వంటి వ్యాపారాలు చేశారే తప్పా ఏనాడు ప్రజాహిత కార్యక్రమాలు చేసిన దాఖలాలు లేవని వనమాడి అన్నారు. ఇతరుల కుటుంబాలను విమర్శించే ముందు వారి చీకటి వ్యాపార చరిత్ర ప్రజలందరికీ తెలుసన్నారు. మంగళవారం కాకినాడలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో వనమాడి విలేకరులతో సమావేశాన్ని నిర్వహించారు. తమ పార్టీ యువ నేత లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు భారీ ఎత్తున ప్రజలను స్పందన, ప్రభుత్వ వైఫల్యాలపై వినతులను ఇచ్చేందుకు ఆయా వర్గాలకు చెందిన ప్రజలు పోటెత్తారన్నారు. ఈ ఈ స్పందన చూసి ద్వారంపూడి లోకేష్ యువగళంపై అనవసర వ్యాఖ్యలు చేశారన్నారు.