సిరా న్యూస్, తలమడుగు:
చదువుతోనే ఉన్నత శిఖరాలు…
– జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా. సీహెచ్ వీ.ఆర్.ఆర్ వరప్రసాద్
చదువుతోనే ఉన్నత శిఖరాలను అదిరోహించడం సాధ్యమని అదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా. సీహెచ్ వీ.ఆర్.ఆర్ వరప్రసాద్ అన్నారు. శనివారం తలమడుగు మండలం లక్ష్మీపూర్ గ్రామంలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర స్పెషల్ అసిస్టెంట్ కాడే స్వామి తన స్వంత డబ్బులతో ఏర్పాటు చేసిన ఉచిత దుప్పట్లు, స్వెటర్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇతర న్యాయమూర్తులు, బ్యాంక్ అధికారులు, స్థానిక నాయకులతో కలిసి దుప్పట్లు పంపిణీ చేపట్టారు. అనంతరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. గిరిజనులు తమ హక్కుల గురించి తెల్సుకోవాలన్నారు. గ్రామంలో నెలకొని ఉన్న సమస్యల గురించి జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి, పరిష్కరిస్తామని అన్నారు. అంతకు ముందు గ్రామస్తులు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు, అధికారులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం గిరిజన సాంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు న్యాయమూర్తి శివరాంప్రసాద్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి క్షమా దేశ్ పాండే, పీపీ మేకల మధుకర్, బ్యాంక్ స్పెషల్ అసిస్టెంట్ కాడే స్వామి, సర్పంచ్ తొడసం రాధ, తహాసీల్దార్ రాజమోహన్, ఎంఈవో నారాయణ, మెడికల్ ఆఫీసర్ హరీష్, తుడుదెబ్బ విద్యార్థి విభాగం మండల అధ్యక్షుడు మనోహర్, తదితరులు పాల్గొనారు.