ఫిబ్రవరిలో ఎన్నికలు..

సిరా న్యూస్,విజయవాడ;
సార్వత్రిక ఎన్నికలు ఒక నెల ముందే ఎన్నికలు పెట్టే ఆలోచనలో కేంద్ర ఎన్నికల సంఘం ఉందని.. దీనికి బీజేపీ మద్దతు కూడా ఉందని జోరుగా ప్రచారం ప్రారంభమయింది. ఇలా పెట్టే అవకాశం ఉందని చెప్పుకోవడానికి రాజకీయ పరమైన , నిర్వహణ పరమైన కారణాలు స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నాయి. అందుకే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కూడా ఎన్నికలు ఏప్రిల్ లో ఉంటాయని రిలాక్స్ అవమాకండని.. ఫిబ్రవరిలోనే ఉండవచ్చని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల కోసం దాదాపుగా పూర్తి చేసింది. రిటర్నింగ్ ఆఫీసర్లను నియామకం దగ్గర్నుంచి ఈవీఎంలను నియోజకవర్గాలకు చేర్చడం వరకూ అన్ని పూర్తయిపోయాయి. పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిషా వంటి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలుకూడా జరగాల్సి ఉంది. వాటికీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక ఎన్నికల నిర్వహణకు చివరి సన్నాహం అయిన ఓటర్ల జాబితాను అప్ డేట్ చేసే ప్రక్రియ కూడా ఊపందుకుంది. పోలింగ్ కేంద్రాల మార్పులు, చేర్పులు, ఓటర్ల ఫొటోల మార్పుల కోసం ఈ నెల 20 నుంచి జనవరి 5 వరకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. 2024 జనవరి 6న ముసాయిదా ఓటర్ల జాబితా, జనవరి 8న తుది ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు. 2024 జనవరి ఒకటో తేదీ వరకు 18 ఏళ్లు నిండిన వారంతా ఓటరుగా నమోదు చేసుకోవాలని ఎన్నికల సంఘం వెల్లడించింది. అంటే జనవరి మొదటి వారం కల్లా పూర్తి స్థాయిలో ఓటర్ జాబితాలు రెడీ అయిపోతాయన్నమాట. ఇక ఎన్నికల సన్నాహాలు పూర్తయినట్లే. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడానికి రెడీగా ఉన్నట్లే. సాధారణంగా 2019 సార్వత్రిక ఎన్నికలకు మార్చి పదో తేదీన షెడ్యూల్ విడుదల అయింది. మొత్తంగా ఎనిమిది విడతల్లో పోలింగ్ జరిగింది. జూన్ లో కౌంటింగ్ జరిగింది. ఇంత సుదీర్ఘమైన ప్రక్రియపై విమర్శలు వచ్చాయి. అందుకే ఈ సారి ఎన్నికల సంఘం.. నాలుగైదు విడతల్లోనే పూర్తి చేయాలని అనుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దీనికి బీజేపీ కూడా అనుకూలంగానే ఉందంటున్నారు. బీజేపీ ఇప్పుడు జోష్ మీద ఉంది. మూడు హిందీ రాష్ట్రాల్లో విజయంతో హిందీ బెల్ట్ లో తిరుగులేదని మరోసారి నిరూపతమయిందని.. ఆ వేడి తగ్గక ముందే ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుందా అని బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నారని అంటున్నారు. రాజకీయ పరంగా ఫిబ్రవరిలో షెడ్యూల్ రీలీజ్ చేసి .. రెండు నెలల్లో ప్రక్రియ పూర్తి చేస్తే ఎక్కువ కాలం ఎన్నికలను సాగదీసిన్టలుగా ఉండదన్న అభిప్రాయంతో ఉన్నారంటున్నారు. బీజేపీ పెద్దలు ఈ విషయంలో సీరియస్ గా ఆలోచిస్తున్నారని కూడా ఢిల్లీ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఫిబ్రవరిలోనే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసి.. మార్చి లేదా ఎప్రిల్ నాటికి పూర్తి చేయడానికి పాలనా పరమైన కొన్ని ప్లస్ పాయింట్స్ కూడా ఉన్నాయని చెబుతున్నారు. ఫిబ్రవరిలో ప్రారంభిస్తే.. ఎండలు ముదిరే అవకాశం ఉండదు. అదే సమయంలో వివిధ రకాల పరీక్షలకు ముందే ప్రక్రియ పూర్తయిపోతుంది. అదే మార్చిలో షెడ్యూల్ ఇస్తే.. పరీక్షలు కూడా ఎఫెక్ట అవుతాయి సాధారణంగా దక్షిణాదిలో మొదటి విడతలోనే ఎన్నికలు పెట్టేస్తారు. గత ఎన్నికల్లో మొదటి విడతలోనే ఎన్నికలు జరిగాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *