EX Minister Jogu Ramanna: రైతుల‌ను ప్ర‌భుత్వాలు ఆదుకోవాలి:  మాజీ మంత్రి జోగు రామన్న

సిరాన్యూస్‌, బేల‌
రైతుల‌ను ప్ర‌భుత్వాలు ఆదుకోవాలి:  మాజీ మంత్రి జోగు రామన్న

భారీ వ‌ర్షాల‌తో న‌ష్ట‌పోయిన రైతుల‌ను కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఆదుకోవాల‌ని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. మంగ‌ళ‌వారం ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని పెనుగంగా పరివారక ప్రాంతంలో భారీ వర్షాలతో నీట మునిగిన పంట చేల్ల‌ను స్థానిక రైతు బాధితులతో కలిసి మాజీ మంత్రి జోగు రామన్న విస్తృతంగా పర్యటించారు . వ్య‌వ‌సాయ పంట‌ల‌ను కలియ తిరుగుతూ పంట నష్టపోయిన తీవ్రతను రైతులతో అడిగి తెలుసుకున్నారు.. అనంతరం జోగు రామన్న మాట్లాడుతూ మంత్రి శ్రీధర్ బాబు పర్యటన ఉండడంతో కాస్త రైతులకు ఉపయోగపడే హామీలు ఇస్తారేమో అని ఎదురుచూసిన రైతులకు నిరాశకు గురి చేశారన్నారు. స్థానిక ఎమ్మెల్యే పాయల శంకర్ రైతుల పక్షాన నిలబడాల్సిపోయి అధికార పార్టీ మంత్రులతో కమిషన్లు వస్తాయేమో అన్న భ్రమలో రైతాంగ సమస్యలను పక్కనపెట్టి సీసీఐ పరిశ్రమ పట్ల అధికార పార్టీ ఎమ్మెల్యేలతో చేయి కలపడం రైతాంగానికి తీవ్ర అనుమానాలు రేకెత్తిస్తుంది అన్నారు. రైతులకు అందాల్సిన రుణమాఫీ, కౌలు రైతులకు 12000, రైతు రుణం అందించేందుకు స్థానిక బిజెపి నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోవడం పలు అనుమానాలకు తావుతీస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ పార్టీ ప్రెసిడింట్ ప్రమోద్ రెడ్డి, యువనాయకుడు సతీష్ పవర్, సీనియర్ నాయకులు రైతు సమన్వయ అధ్యక్షులు రోకండ్ల రమేష్, నాయకులు మెట్టు ప్రహ్లాద్ ఇజ్జగిరి నారాయణ, దేవన్నా ఒల్లాప్వర్, మాస్కే తెజ్రావు,మదుకర్ జక్కల్వర్,జితేంద్ర బెదుర్కర్, నాయకులు మంగేష్ థాక్రే,విపిన్ ఖోడే,సునీల్ గోడామ్ ,ఆకాష్ గుండావార్ , విశాల్ గోడే , చౌహాన్ సుధాకర్ రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *