సిరాన్యూస్, బేల
ఈనెల 9లోగా డిగ్రీ అడ్మిషన్ చేసుకోవాలి : ప్రిన్సిపాల్ డా వరప్రసాద్ రావు
తెలంగాణ లో డిగ్రీ లో చేరడం కోసం రాష్ట్ర ఉన్నత విద్య మండలి ఒక సువర్ణ అవకాశం కల్పించిందని ఆదిలాబాద్ జిల్లా బేలా కీర్తన డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ డా వరప్రసాద్ రావు ఒక ప్రకటన లో తెలిపారు. సెప్టెంబర్ 9 లోపు అడ్మిషన్లు దోస్త్ ద్వారా తీసుకోవచ్చు తెలిపారు. ఇది రీ ఎంబెర్స్మెంట్ పధకం కిందనే వస్తుందని, కాకపొతే గతం లో దోస్త్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు మళ్ళీ కాలేజీ మార్పు అవకాశం లేదన్నారు. వివిధ కారణాలతో ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసుకొని వారు ఈ ఆవకాశం సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. పూర్తి వివరములు కు సంబంధిత కాలేజ్ లో దోస్త్ కో ఆర్డినేటర్ లను సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.