EX Minister Jogu Ramanna: రైతుల‌కు మంత్రి శ్రీధర్ బాబు క్షమాపణ చెప్పాలి : మాజీ మంత్రి జోగు రామన్న

సిరాన్యూస్‌, ఆదిలాబాద్‌
రైతుల‌కు మంత్రి శ్రీధర్ బాబు క్షమాపణ చెప్పాలి : మాజీ మంత్రి జోగు రామన్న

కాంగ్రెస్ మంత్రి శ్రీధర్ బాబు బేష‌ర‌త్తుగా ఆదిలాబాద్ రైతులకు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ బీజేపీలో ఏటీఎంగా వ్యవహరిస్తున్నాయని, నేటి మంత్రి పర్యటనలో ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యే పాయ‌ల్‌ శంకర్ రైతుల పక్షాన ప్రశ్నించకుండా వారితో కలిసి సీసీఐ సందర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. ఒకపక్క ఆదిలాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసి పెనుగంగా పరివారక ప్రాంతాల్లో పంటలు నష్టపోయి తీవ్ర నష్టాల్లో ఉన్న రైతాంగాన్ని పరామర్శించాల్సిన కాంగ్రెస్ మంత్రి స్థానిక రైతులను నిరాశకు గురి చేశారన్నారన్నారు. రైతాంగం కష్టాలను పక్కనపెట్టి కమిషన్ల కోసం సీసీఐ పరిశ్రమను సందర్శించడం రైతులకు తీవ్ర ఆగ్రహాన్ని గురిచేస్తుందన్నారు. కామాయి గ్రామం నుండి మాండగడ రైతులు మినిస్టర్ రాక కోసం ఎదురు చూస్తా ఉంటే రైతులకు ఎలాంటి భరోసా ఇవ్వకుండా వెళ్లిపోవడం పట్ల రైతుల పట్ల వారికున్న విజ్ఞత స్పష్టమవుతుంది అన్నారు. బాధలో ఉన్న రైతులకు ధైర్యం చెప్పలేని మంత్రి పర్యటన ఎందుకని జోగు రామన్న ప్రశ్నించారు. రైతుల ప్రక్షాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన పోయి బీజేపీ ఎమ్మెల్యే పాయల శంకర్ కమిషన్ల కోసం కాంగ్రెస్ మంత్రులతో సీసీ పరిశ్రమలు సందర్శిస్తున్నారని కమిషన్ల కాసుల కోసమేనా అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి అన్నారు. గతంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొండ లక్ష్మణ్ నారాయణ పరిశ్రమల శాఖ మంత్రిగా సీసీఐ ప్రస్తావన ఉండదని స్పష్టం చేయడం జరిగింది అన్నారు. బి ఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి కేటీఆర్ సీసీఐ నిర్వహణ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పజెప్పాలని ప్రతిపాదనలు పంపించినప్పటికిని కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం జరిగిందని గుర్తు చేశారు. స‌మావేశంలో రైతు జిల్లా సమన్వయ అధ్యక్షులు రూకండ్ల రమేష్, మాజీ మార్కెట్ చైర్మన్ మెట్టు ప్రలాద్, కొమ్ర రాజు,ఎక్స్ ఎంపీపీ గండ్రత్ రమేష్, మెస్రం పరమేశ్వర్,అశోక్ స్వామి.మోబిన్, ఆసిఫ్, కొడప రాము, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *