సిరాన్యూస్, ఆదిలాబాద్
మాజీ మంత్రి జోగు రామన్న హౌస్ అరెస్ట్
* బిఆర్ఎస్ కార్యకర్తలను అరెస్టులతో ఆపలేరు
* త్వరలో ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెబుతాం
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి పై దాడికి నిరసనగా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను నిరసనను వ్యక్తం చేస్తున్న క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దాహంతో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ముందస్తు అరెస్టులకు పాల్పడుతుంది. అందులో భాగంగానే మాజీ మంత్రి జోగు రామన్నను శుక్రవారం పోలీసులు శాంతినగర్‌లోని తన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.