సిరాన్యూస్, ఓదెల
మహిపాల్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రేగడిమద్దికుంటా గ్రామానికి చెందిన అన్నెడీ.మహిపాల్ రెడ్డి ఇటీవల మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్నపెద్దపెల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి శుక్రవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన వెంట గడ్డం.మహిపాల్ రెడ్డి, నిశాంత్ రెడ్డి, నోముల శ్రీనివాస్ రెడ్డి, బుర్ర కుమార్, రమేష్ ,రవి తదితరులు పాల్గొన్నారు.