సిరాన్యూస్, చిగురుమామిడి
చిగురుమామిడిలో ఘనంగా మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ జన్మదిన వేడుకలు
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ జన్మదిన వేడుకలను బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు.ఈ జన్మదిన వేడుకలకు బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై కేక్ కట్ చేసి మాట్లాడారు.పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మాజీఎమ్మెల్యే సతీష్ కుమార్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరారు. భవిష్యత్తులో మరెన్నో పదవులు ఆశించాలని కార్యకర్తలు నాయకులు అభిమానులు ఆకాంక్షించారు.రెండుసార్లు హుస్నాబాద్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా సతీష్ కుమార్ అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ జంగా వెంకటరమణారెడ్డి, సింగిల్ విండో వైస్ చైర్మన్ కరివేద మహేందర్ రెడ్డి, మండల నాయకులు మంకు శ్రీనివాస్ రెడ్డి,గ్రామ శాఖ అధ్యక్షులు ఆకవరంమఠం శివప్రసాద్,నాయకుల పెనుకుల తిరుపతి,బెజ్జంకి రాంబాబు,మాజీ సర్పంచులు కానుగంటి భూమిరెడ్డి,బెజ్జంకి లక్ష్మణ్,సన్నిల్ల వెంకటేష్,బోయిని శ్రీనివాస్, అన్నాడు మల్లికార్జున్ రెడ్డి, తాటికొండ సందీప్ రెడ్డి, దేశిని రాజయ్య,నాగెల్లి రాజిరెడ్డి, ఎండి సర్వర్ పాషా, పెసరి మొగిలి, బొట్ల రవి, బోయిని శంకర్,నిలుగొండ దశరథం, పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.