సిరా న్యూస్, కుందుర్పి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పరామర్శించిన మాజీ ఎంపీ తలారి రంగయ్య
కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం, తూముకుంట గ్రామానికి చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జగదీష్ పై గత మూడు రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ నాయకుల దాడిలో గాయపడి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎంపీ తలారి రంగయ్య ఆస్పత్రికి వెళ్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జగదీష్‌ను పరామర్శించారు. అలాగే కళ్యాణదుర్గం పార్వతి నగర్ చెందిన వడ్డే ఆదెప్ప బైక్ యాక్సిడెంట్లు గాయపడి సవేరా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నఆమెను పరామర్శించారు. అనంతరం అక్కడ ఉన్న హాస్పిటల్స్ సూపరింటెండెంట్, సవేరా హాస్పిటల్ ఎండి పరిస్థితి తెలుసుకొని వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.