సిరా న్యూస్,రంగారెడ్డి;
సరూర్ నగర్ లోని మినీ ట్యాంక్ బండ్ పై గణేష్ నిమజ్జనానికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు. గణేష్ నిమజ్జనం కొరకు 8 క్రేన్లు ఏర్పాటు చేసారు అధికారులు, ఇద్దరు డిసిపిలు, ఒక అడిషనల్ డీసీపీ తో సహా 400 మంది పోలీసులచే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 500 మంది మున్సిపల్ సిబ్బంది ఈ రోజు సరూర్ నగర చెరువు వద్ద విధుల్లో ఉన్నారు.. ప్రతి దృశ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించడానికి పూర్తిగా 77 కెమెరాలు ఏర్పాటు చేసారు. నిమజ్జనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం ఏర్పడకుండా ఒక ఉచిత వైద్య శిబిరము, అంబులెన్స్ మరియు మొబైల్ బయో టాయిలెట్స్ లని ఏర్పాటు చేసారు.