సిరా న్యూస్, గుడిహత్నూర్:
ఉదారత చాటిన మాజీ సర్పంచ్ రవి నాయక్…
-బాధిత కుటుబానికి రూ.10వేలు అందజేత
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ గ్రామ మాజీ సర్పంచ్ రవి నాయక్ ఉదారత చాటుకున్నారు. శనివారం గుడిహత్నూర్ మండలం ఎక్స్ రోడ్ కి చెందిన ధూల్శెట్టి దయానంద్ కుటుంబ సభ్యులకు రూ.10వేల నగదును అందజేశారు. నెలరోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర దయానంద భార్య సుజాతకు తీవ్ర గాయాలు కాగా హైదరాబాద్ లోని ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, గుడిహత్నుర్ మాజీ సర్పంచ్ శ్రీ పవార్ రవి నాయక్, మండల నాయకులతో కలిసి బాధితురాలి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఇంటి సభ్యులతో మాట్లాడి, ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. దైర్యంగా ఉండాలని, తామంతా ఉన్నామని అన్నారు. తన వంతుగా రూ .10 వేల సహాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. మండల పార్టీ సీనియర్ నాయకులు మాధవ్ కేంద్రే, నీలకంఠ్ అప్ప, సిద్దార్థ్ సాసనే, రావణ్ ముండే, MD గౌస్, PACS ఛైర్మెన్ ముండే సంజీవ్, తదితరులు ఉన్నారు.