సిరాన్యూస్, కళ్యాణదుర్గం
అవార్డు గ్రహీత ఎమ్మెల్యే సురేంద్ర బాబుకు సన్మానం : మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రహీం బుజ్జి
అవార్డు గ్రహీత, ఎమ్మెల్యే సురేంద్ర బాబును సోమవారం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రహీం బుజ్జి ఘనంగా సన్మానించారు. ఇటీవల ఎన్నారై వెల్ఫేర్ సొసైటీ యూకే లోనీ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ మ్యూజియం లో అక్టోబర్ 2న గ్లోబల్ ఇండియన్స్ వారికి అందించే ప్రతిష్టాత్మకమైన మహాత్మా గాంధీ లీడర్ షిప్ అవార్డును కళ్యాణదుర్గం శాసన సభ్యులు అమిలినేని సురేంద్ర బాబు అందుకున్నారు. ప్రతి సంవత్సరం గాంధీ జయంతి సందర్బంగా మహాత్మా గాంధీ లిడర్ షిప్ అవార్డును ప్రదానం చేస్తారు. ఇందులో భాగంగానే ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు మెడల్ ను ఆక్స్ ఫర్డ్ మేయర్ మైక్ రోలే నుండి సర్టిఫికెట్ ను ఎన్నారై వెల్ఫేర్ సొసైటీ అంబాసిడర్ జడ్డి డాక్టర్ అజిత్ స్వరణ్ సింగ్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈసందర్బంగా కళ్యాణదుర్గం నియోజకవర్గానికి వచ్చిన ఎమ్మెల్యే కి సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ అబ్దుల్ రహీం బుజ్జి, విట్లం పల్లి, టీడీపి సీనియర్ నాయకులు, భీమ్ లింగ రాజేష్, తదితరులు పాల్గొన్నారు.