సిరాన్యూస్, కళ్యాణదుర్గం
రిజిస్ట్రేషన్ల సమస్య పరిష్కారానికి కృషి : ఎమ్మెల్యే సురేంద్ర బాబు
రిజిస్ట్రేషన్ల సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు అన్నారు. కళ్యాణదుర్గం పట్టణంలోని పలు చోట్ల అక్రమ లే అవుట్లు వేయడంతో వాటిపై అధికారులు నోటీసులు ఇవ్వడం విధితమే. అయితే పలువురు ప్లాట్ల యజమానులు తమ కూతుర్లు చదువులు,పెళ్లిళ్లు, వ్యాపారాల అవసరాల నిమిత్తం విక్రయించాలంటే కొనుగోలు దారులు రిజిస్ట్రేషన్లు తప్పనిసరిగా చేయించాలంటున్నారు. దీంతో లండన్ పర్యటన ముగించుకొని కళ్యాణదుర్గం లోని ప్రజావేదిక వద్ద అమిలినేని సురేంద్ర బాబు రావడం తో ప్లాట్ల యజమానులు చేరుకొని తమ సమస్యలు విన్నవించారు.ఇందుకు స్పందించిన అమిలినేని సురేంద్ర బాబు తక్షణమే సబ్ రిజిస్టర్, మున్సిపల్ కమిషనర్ తో మాట్లాడి సమస్య పరిస్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.