సిరాన్యూస్, కాల్వశ్రీరాంపూర్
ఈనెల 9న నిరసన ప్రదర్శన : ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు అంబాల రాజేందర్
ఉద్యోగనియామకంలో మాదిగ లను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు అంబాల రాజేందర్ అన్నారు. సోమవారం పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు అంబాల రాజేందర్ మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ ప్రకారం ఉద్యోగ నియామకాలు చేపడతామని ,అవసరమైతే అందుకోసం ఆర్డినెన్సు తీసుకువస్తామని అసెంబ్లీలో హామీ ఇచ్చి రెండు నెలలు కాలయాపన చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరికి నిరసనగా ఈ నెల 9 వ తేదీన అంబేద్కర్ విగ్రహాల వద్ద నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయాల వరకు జరుగు నిరసన ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు పుల్లూరి సాగర్, కొండ్ర వివేక్,పాల శంకర్, సదానందం, బొల్లి స్వామి,చిన్న స్వామి,పుల్లూరి సదానందం తదితరులు పాల్గొన్నారు.