సిరాన్యూస్, బేల
చెప్రాలలో హైమాక్స్ లైట్ ఏర్పాటు: మాజీ జడ్పీటీసీ అక్షిత సతీష్ పవార్
ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని చెప్రాల గ్రామంలో రూ. 2 లక్షల జెడ్పి నిధులతో హైమాక్స్ లైట్ ఏర్పాటు చేశారు. సోమవారం మాజీ జడ్పీటీసీ అక్షిత సతీష్ పవార్ హైమాక్స్ లైట్లను ప్రారంభించారు.ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ ఒక హైమాక్స్ లైట్ గ్రామపంచాయతీ దగ్గర మరొక లైట్ హై స్కూల్ దగ్గర పెట్టించామన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు యాసం సతీష్,నకాతే శాలిక్, వడ్డె పోశెటి ,రహూత్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.