సిరా న్యూస్,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ;
కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం బడుగువానిలంక అనధికార ఇసుక ర్యాంపులో గత 15 రోజులుగా నిరంతరాయంగా ఇసుక తవ్వకాలు సాగుతున్నాయి. బుధవారం రాత్రి 8 గంటలైనా ట్రాక్టర్ల పై ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయి. బుధవారం బడుగువానిలంక గ్రామంలో రెవెన్యూ సదస్సు జరిగినా ఇటువంటి పత్రాలు లేకుండా జరుగుచున్న ఈ అక్రమ రవాణా పై రెవెన్యూ శాఖ చూడకపోవటం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బడుగువానిలంక అనధికార ర్యాంపులో ఒక్కొక్క ట్రాక్టర్కు 1000 రూపాయల నుండి 1500 వరకు వసూళ్లు చేస్తున్నారు. కాగా ట్రాక్టర్ ద్వారా ఇసుకను గ్రామాలకు తరలించి మూడు నుండి నాలుగు వేల రూపాయల వరకు బహిరంగంగా అమ్మకాలు సాగిస్తున్నారు.