సిరా న్యూస్,నిజామాబాద్;
ఎడపల్లి మండలం వడ్డేపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తల్లి ,తండ్రి, కుమారుడు మృత్యువాత పడ్డారు. సురేష్ (55), హేమలత (50), హరీష్ (22). కుమారుడు ఆన్లైన్ బెట్టింగ్ లో మోసపోయి డబ్బులు పోగొట్టుకున్నట్లు సమాచారం. ఆన్లైన్ బెట్టింగ్ తో పాటు కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.