సిరాన్యూస్, భీమదేవరపల్లి
అప్పుల బాధతో రైతు మల్లమారి రవీందర్ ఆత్మహత్య
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం అప్పుల బాధతో రైతు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన వంగర గ్రామం లో గురువారం చోటుచేసుకుంది.మృతుడి భార్య మల్ల మారి కవిత తెలిపిన వివరాల ప్రకారం…. వంగర గ్రామానికి చెందిన రైతు మల్లమారి రవీందర్ వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొన సాగిస్తున్నాడు. వీరికి కొడుకు, కూతురు ఉన్నారు.కొడుకు అన్వేష్ ఎంబిబిఎస్ చదువుతున్నాడు.కూతురు అశ్విని బిఎడ్ పూర్తిచేసి ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పని చేస్తుంది.పిల్లల ఉన్నత చదువుల కోసం కొంత అప్పు చేశాడు. అప్పులు ఎలా తీర్చాలని రోజు బాధపడుతూ ఉండేవాడు.గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు రోజులాగే వ్యవసాయ పనుల నిమిత్తం మధ్యాహ్నం బావి దగ్గరికి వెళ్ళాడు.సాయంత్రం అయినా ఇంటికి తిరిగి రాకపోయేసరికి అతని భార్య మల్లమారి కవిత బావి దగ్గర పలు చోట్ల వెతికిన ఆచూకీ లభ్యం కాలేదు.శుక్రవారం తెల్లవారు జామున వ్యవసాయ బావి దగ్గర చెట్టుకు ఊరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.పక్కన భూమి ఉన్న రామారపు లింగయ్య అనే వ్యక్తి గమనించి మృతుడి భార్య కవితకు ఫోన్ ద్వారా విషయాన్ని తెలిపారు.విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బావి దగ్గరికి వెళ్లేసరికి చింత చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయి ఉన్నాడు.