Kandi Srinivasa Reddy: రైతులు అధైర్య‌ప‌డ‌వద్దు : కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇంచార్జ్ కంది శ్రీనివాస రెడ్డి

సిరాన్యూస్‌, బేల‌
రైతులు అధైర్య‌ప‌డ‌వద్దు : కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇంచార్జ్ కంది శ్రీనివాస రెడ్డి

రైతులు అధైర్య‌ప‌డ‌వ‌ద్ద‌ని ప్ర‌భుత్వం త‌ప్ప‌కుండా ఆదుకుంటుంద‌ని రైతుల‌కు ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కంది శ్రీనివాస రెడ్డి భ‌రోసా నిచ్చారు. అదిలాబాద్ జిల్లా బేలా మండలం ఖోగ్దూర్ గ్రామంలో ఇటీవల కురిసిన వాన‌లు వ‌ర‌ద‌ల‌కు దెబ్బ‌తిన్న పంట‌పొలాల‌లను రోడ్ల‌ను  శుక్ర‌వారం ప‌రిశీలించిన ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కంది శ్రీనివాస రెడ్డి ప‌రిశీలించారు.ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ గ్రామంలో దాదాపు వంద‌ల ఎక‌రాల్లో పంట‌న‌ష్టం జ‌రిగింద‌ని అన్నారు. మ‌రికొద్ది నెల‌ల్లో చేతికొచ్చే ప‌త్తి పంట కోల్పోయిన రైతులు ఎవ‌రూ అధైర్య‌ప‌డ‌వ‌ద్ద‌ని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్ర‌జా ప్ర‌భుత్వ‌మ‌ని న‌ష్ట‌పోయిన రైతుల‌కు న‌ష్ట‌ప‌రిహారం చెల్లించి అండ‌గా ఉంటుంద‌ని భ‌రోసా క‌ల్పించారు. ఈ కార్యక్రమం లో బేలా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఫైజల్లా ఖాన్,మాజీ జడ్పీటీసీ రాందాస్ నాక్లే,బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు సంజయ్ గుండవార్,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వామన్ వాంఖడే,యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి,మాజీ ఎంపీటీసీ బండి సుదర్శన్, నానాజీ వైద్య, ఎస్. టి సెల్ మండల అధ్యక్షులు మాడవి చంద్రకాంత్, నాయకులు గన్శ్యామ్ ఘవండే, ఈశ్వర్ దొటే, సీతారామ్, విపిన్ టాక్రే, సింగిరెడ్డి రామ్ రెడ్డి, లోక ప్రవీణ్ రెడ్డి, డేరా కృష్ణ రెడ్డి, గంభీర్ టాక్రే, నాయాన్, సుధాం రెడ్డి, బే మండల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *