సిరా న్యూస్, గుడిహత్నూర్:
రైతు ఆత్మహత్య…
+ సొంత చేన్లో ఉరేసుకున్న జైయ్ బాయ్ వెంకటి
+ పంచనామా నిర్వహించిన పోలీసులు
+ ఇంకా వెల్లడి కానీ పూర్తి వివరాలు
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రానికి చెందిన రైతు వెంకటి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం… గుడిహత్నూర్ మండల కేంద్రానికి చెందిన జైయ్ బాయ్ వెంకటి శనివారం మచ్చపూర్ గ్రామ శివారులో గల తన సొంత చేనులో చెట్టుకు కు ఉరి వేసుకొని అత్మాహత్యకు పాల్పడ్డాడు. మృతికి గల పూర్తి కరుణాలు తెలియాల్సిన ఉంది. పోలీసులు పంచనామ నిర్వహించి, శవాన్ని శవ పరీక్ష నిమిత్తం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ కు తరలించారు.