అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..

ఏపీకి చెందిన ముగ్గురి మృతి!

సిరా న్యూస్;

అగ్రరాజ్యం అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాండాల్ఫ్‌ సమీపంలో సోమవారం సాయంత్రం ఈ దారుణ ఘటన జరగ్గా ఈ ప్రమాదంలో ఐదుగురు ఎన్‌ఆర్ఐలు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఓ మహిళ సహా ముగ్గురుఏపీలోని ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన వారు ఉన్నారు.

దక్షిణ బాన్‌హామ్‌ కు ఆరు మైళ్ల దూరంలో స్టేట్ హైవే పై సాయంత్రం 6.45 గంటలకు రెండు వాహనాలు ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది.ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు , మృతుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఈ ఘటనను మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ దృష్టికి తీసుకెళ్లామని ప్రవాస భారతీయ ప్రతినిధులు తెలిపారు. ఈ ప్రమాదం గురించి టెక్సాస్‌ పబ్లిక్‌ సేఫ్టీ వర్గాలు ప్రకటించాయి.ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం.. ఈ ప్రమాదంలో చనిపోయినవారిని తిరుపతి జిల్లా గూడూరుకు చెందిన వారిగా అధికారులు గుర్తించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *