సిరా న్యూస్,బీబీనగర్;
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ సమీపంలో ఎంఎస్ఎన్ కెమికల్ కంపెనీ గత కొన్ని సంవత్సరాలుగా బీబీనగర్ ఉందని దాని నుండి వెలువడే విష కాలుష్యం వల్ల బీబీనగర్ ప్రజలు తీవ్ర ఇబ్బందులుఎదుర్కొంటున్నారనిప్రజలుఅంటున్నారు. ఫ్యాక్టరీ నుండి వెలువడే విషపోగా ,వ్యర్థ పదార్థాలు, భూమిలోకి వదలడం వల్ల భూమిలోని నీరు కలుషితం అవుతుందని ఆ నీరు తాగడం వల్లప్రజలుక్యాన్సర్ బారినపడుతున్నారనిఅంతేకాకుండా చర్మవ్యాధులు మహిళలకు గర్భ స్రావాలు జరుగుతున్నాయని అంటున్నారు. ఫ్యాక్టరీ నుండి ఎవడే పొగ వల్ల ప్రజలకు చర్మవ్యాధులు ఊపిరితిత్తులుపాడైతున్నాయని ప్రజలు ఆసుపత్రి పాలవుతున్నారని ప్రజలు అంటున్నారు. ప్రజలు కొన్ని రోజులుగా కంపెనీ ఎదుట ధర్నాలో నిర్వహించిన అధికారుల్లో చలనం లేదని అంతేకాకుండా ఫ్యాక్టరీకి సంబంధించినయాజమాన్యం స్పందించకపోవడం చాలా బాధాకరమని అంటున్నారు. బీబీనగర్ లో ఎన్నో కెమికల్ కంపెనీలు ఉన్నాయని వాటిని వెంటనే తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.