ఇద్దరు సజీవ దహనం
సిరా న్యూస్,చిత్తూరు;
బంగారుపాళ్యం మండలం, మొగిలి ఘాట్ రోడ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు లారీలు ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. ఇద్దరు సజీవ దహనం అయ్యారు. ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. లారీ అతివేగంగా వచ్చి ఆగివున్న కొయ్యల లోడ్ లారీని వెనుకవైపు నుండి ఢీ కొనడంతో అకస్మాత్తుగా మంటలు చెలరేగి లారీ కింద నిద్రిస్తున్న డ్రైవర్, మరియు లారీ లోపల నిద్రిస్తున్న క్లినర్ మంటల్లో చిక్కుకుని మృతి చెందారు. వెనక ఢీ కొన్న లారీ డ్రైవర్, క్లినర్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఘటన స్థలానికి చేరుకున్న ఫెయిర్ సిబ్బంది మంటలను అదుపు చేసేలోపే పూర్తిగా దగ్దమైంది. బంగారుపాళ్యంలో వరస రోడ్డు ప్రమాదాలపై ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. సంఘటన స్థలాన్ని చేరుకున్న బంగారుపాల్యం పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.