సిరా న్యూస్, తలమడుగు:
గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్‌ల పాత్ర కీలకమైంది…
గ్రామ పంచాయతీలు, అనుబంధ గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో సంబందిత గ్రామ సర్పంచ్‌ల పాత్ర కీలకమైందని ఆదిలాబాద్ జిల్లా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. ఆదివారం తలమడుగు మండలంలోని బరంపూర్ గ్రామంలోని రైతు వేదికలో నిర్వహించిన సర్పంచుల అత్మీయ సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ గొడం నగేష్‌తో కలిసి సర్పంచ్‌లను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… పదవి విరమణ కేవలం సర్పంచ్ పదవికేనని అన్నారు. తజా మాజీ సర్పంచ్‌లంత రానున్న రోజుల్లో మరిన్ని ప్రజా సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్లాలని ఆకాక్షించారు. అనంతరం మాజీ ఎంపీ గొడం నగేష్ మాట్లాడుతూ.. మాజీ సర్పంచ్‌లు ఎవరూ అధైర్యపడవద్దని, తామంత వారి వెంట ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో వివిద గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటీసీలు, నాయకులు పాల్గొన్నారు.