సిరా న్యూస్,తణుకు;
పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం తేతలి దువ్వ జాతీయ రహదారి మధ్యలో నిబంధనలకు విరుద్ధంగా బాణా సంచా అమ్మకాలు జరుగుతున్నాయి. 30 డిగ్రీల ఎండలో రాసులుగా పోసి నాటు టపాకాయిలు, చిచ్చుబుడ్లు, ఉల్లి బాంబులు, జువ్వలు యధేచ్చగా అమ్మకాలు జరుగుతున్నాయి. పెట్రోల్ బంకుకు అతి చేరువలో నాటు సరుకుతో రాసులుగా పోసి అమ్మకాలు బాణసంచా వ్యాపారులు సాగిస్తున్నారు. లైసెన్స్ కు మించి భారీ ఎత్తున ప్రమాదకరమైన మందుగుండు సామాగ్రి సరుకు నిల్వలు ఉంచి అమ్మకాలు సాగిస్తున్నారు. సరైన అనుమతులు లేకుండా ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకుండా స్ర్పింక్లర్లు, పరికరాలు లేకుండా హోల్ సేల్, రిటైల్ షాపులు ఏర్పాటుచేసారు. ఏదైనా ప్రమాదం జరిగితే అక్కడే ఉన్న పెట్రోల్ బంకు అంటుకునే ప్రమాదం పొంచుకుని వుంది.