సిరా న్యూస్,అనకాపల్లి;
జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ అనకాపల్లి జిల్లా వి.మాడుగుల పోలీసులకు అందిన ముందస్తు సమాచారం మేరకు చెక్పోస్టులు తనిఖీలో భాగంగా సుమారు 408 కేజీల గంజాయి రెండు కేజీల గంజాయి (యాశస్) గంజాయి లిక్విడ్ ని పట్టుకున్నామని అని అన్నారు .
వీటి విలువ సుమారు 21లక్షల రూపాయలు ఉంటుందని ఎస్పీ తెలిపారు.గాంజాయ్ అక్రమ రవాణకి తరలించే వెహికల్స్ ఒకలారీ. బొలెరో వ్యాన్. పల్సర్ మోటార్ బైక్ సీజ్ చేసామని అన్నారు .గాంజాయి అక్రమ రవాణాలో కేరళకు చెందిన ముగ్గురు స్మగ్లర్లు చింతపల్లి ఏజెన్సీ ప్రాంతానికి చెందిన ముగ్గురు స్మగ్లర్లు మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.గాంజాయి అక్రమ రవాణా ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు . స్మగ్లర్ కోసం పోలీసులు గాలిస్తున్నామన్నారు.