ఏర్పాట్లు చేస్తున్న వైకాపా నాయకులు కార్యకర్తలు
సిరా న్యూస్,బద్వేలు;
ఈనెల 23న గుంటూరు, వైయస్సార్ జిల్లాల్లో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పర్యటనఅఘాయిత్యానికి, హత్యాచారానికి గురైన ఆడపిల్లల కుటుంబాలను పరామర్శించనున్న వైయస్సార్ సీపీ అధినేత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 23న బుధవారం గుంటూరు, వైయస్సార్ జిల్లాల్లో పర్యటించనున్నారు. అఘాయిత్యాలకు గురైన ఆడపిల్లల కుటుంబాలను పరామర్శించనున్నారు. టీడీపీ కార్యకర్త, రౌడీ షీటర్ దుర్మార్గం కారణంగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన తెనాలికి చెందిన యువతిని బుధవారం ఉదయం శ్రీ వైయస్ జగన్ పరామర్శించనున్నారు. గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న యువతిని, ఆమె కుటుంబాన్ని కలుసుకోనున్నారు. ఆ తర్వాత బద్వేలులో హత్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని అదే రోజు మధ్యాహ్నం శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు. అనంతరం ఆయన నేరుగా పులివెందులకు వెళ్తారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది.