సిరాన్యూస్, ఓదెల
ఇద్దరు అంధులకు వెలుగులు ప్రసాదించిన ఎలక్ట్రిషియన్ మెరుగు శంకరయ్య
* దుఃఖంలో కూడా నేత్రదానం చేసి స్ఫూర్తిగా నిలిచిన కుటుంబం
* అభినందించిన సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులు
ఆయన ఎలక్ట్రిషియన్.. ఇంటికి వెలుగులు పంచేందుకు ఇంతకాలం పని చేసి అందరి మన్ననలు పొందారు. గుండెపోటుతో మంగళవారం ఆయన మృతి చెందగా, తన నేత్రాలను ఇద్దరు అంధులకు దానం చేసి వారికి వెలుగులు ప్రసాదించి.. మరణంలో కూడా అందరికీ స్ఫూర్తిని చాటుకున్నారు. ఆయనే మెరుగు శంకరయ్య. స్వగ్రామం ఓదెల. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ ప్రాంతానికి చెందిన మేర్గు శంకరయ్య(63), ప్రైవేట్ ఎలక్ట్రిషియన్ గా పని చేస్తుండే వారు. మంగళవారం గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన నేత్రాలను దానం చేస్తే ఇద్దరికి చూపును ప్రసాధించవచ్చని మృతుని కుటుంబ సభ్యులకు వారి దగ్గరి బంధువు, సదాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి మేర్గు భీష్మాచారినేత అవగాహన కల్పించారు. దీంతో స్పందించిన కుటుంబ సభ్యులు నేత్రదానంకు అంగీకరించగా, భీష్మాచారి ఆధ్వర్యంలో మృతుని నేత్రాలను సేకరించి హైదరాబాద్ లోని ఐ ఇనిస్ట్యూట్ కు తరలించారు. ఇంటి పెద్దను కోల్పోయిన దుఃఖంలో కూడా ఆయన నేత్రాలను దానం చేసిన మృతుని భార్య అరుణ, కొడుకులు, కో డళ్లు రాజేంద్రప్రసాద్-సౌజన్య, ప్రవీణ్ కుమార్-రాజేశ్వరి, కూతురు, అల్లుడు ప్రవళిక-మహేందర్ ను సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు టి.శ్రవణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి సీహెచ్. లింగమూర్తి, గౌరవ అధ్యక్షుడు సానా రామకృష్ణా రెడ్డి, ముఖ్య సలహాదారులు నూక రమేష్, కార్యదర్శి మేర్గు భీష్మాచారి, ప్రచార కార్యదర్శి కే.ఎస్.వాసు క్యాతం మల్లేశం మేర్గు సారంగం బైరి వినోద్ తదితరులు అభినందించారు. మృతుని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలిపారు.