-గోదావరిఖని ఏసిపి మడత రమేష్
-ఎస్.జి.ఫ్ ఉమ్మడి జిల్లాస్థాయి కరాటే టోర్నమెంట్ ప్రారంభం
సిరా న్యూస్,మంథని;
క్రీడలు మానసిక ఉల్లాసన్ని కలిగిస్తాయి అని, పిల్లలు చిన్ననాటి నుంచే చదువుతో పాటు క్రీడాలపై ఆసక్తి పెంచుకోవాలని గోదావరిఖని ఏసిపి మడత రమేష్ అన్నారు.
గోదావరిఖని ఆర్ సి ఓఏ క్లబ్ లో పెద్దపల్లి జిల్లా ఎస్ జి ఫ్ సెక్రటరీ కొమురోజు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా 68వ స్కూల్ గేమ్స్ కరాటే పోటీలను ప్రారంభించారు.ఈ పోటీలకు ముఖ్యఅతిథిగా గోదావరిఖని ఏ సి పి రమేష్ హాజరై మాట్లాడుతూ క్రీడాలతో జ్ఞానం పెరగటంతో పాటు శారీరదారుద్యం పెరుగుతుందని, క్రీడా సర్టిఫికెట్ కోటాలో ఉన్నత చదువులు, ఉద్యోగావకాశాలు వస్తాయి అని విద్యార్థులతో అన్నారు. గెలుపొందిన క్రీడాకారులకు ఆయన మెడల్స్, సర్టిఫికెట్స్ ప్రధానం చేసారు.ఎస్ జి ఫ్ కరాటే రాష్ట్రస్తాయి పోటీలకు మంథని జె కె ఏ షోటోఖాన్ కరాటే క్రీడాకారులు ఎంపికయ్యారు.కరాటే ఇనిస్ట్రక్టర్ కోండ్ర నాగరాజు ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కరాటే పోటీలకు అండర్ 14 విభాగంలో వడ్లకొండ శ్రీనిత (-46 కె. జి ) అండర్ 17 విభాగంలో తోట హాసిని (-40 కె. జి ),రాగుల సహస్ర ( -56 కె జి ),బేరా ఆదిత్య తేజ (-40 కె. జి ), పొట్ల శ్రావణ్ కుమార్ (-45 కె. జి ),డుల్ గచ్ దేవాన్ష్ (-54 కె. జి ), నివాస్ (-58 కె. జి ),రంగు శ్రీ చరణ్ (-62 కె. జి ) ఎన్నికయ్యారు. గెలుపొందిన విద్యార్థులను ఏసిపి మడత రమేష్ , జె కే ఏ సౌత్ జోన్ ఇంచార్జి రాపోలు సుదర్శన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు నూకల బానయ్య , పెద్దపల్లి జిల్లా ఏస్. జి. ఫ్ సెక్రెటరీ కొమురోజు శ్రీనివాస్, పి.ఈ. టి మాధురి, ఇంద్రాణి, శివ, సతీష్, పెద్దపల్లి జిల్లా కరాటే మాస్టర్స్ అభినందించారు.