సిరా న్యూస్,హైదరాబాద్;
అసెంబ్లీ స్పీకర్ పదవి కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. ఈరోజు సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్ గడువుంది. మధ్యాహ్నం వరకు ఒకే ఒక నామినేషన్దాఖలు అయింది. కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజార్టీ ఉండడంతో స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు మద్దతు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సైతం నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఎంఐఎంఎమ్మెల్యేలు, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామ్యూల్, తదితరులు పాల్గొన్నారు. రేపు స్పీకర్గా గడ్డం ప్రసాద్ ఏకగ్రీవం కానున్నారు. 15న అసెంబ్లీ, మండలి ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. 16న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తీర్మానం చేయనున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుపాల్గొన్నారు.