సిరా న్యూస్,హైదరాబాద్;
వచ్చే అసెంబ్లీ సెషన్ వరకు పూర్తిగా మారిపోవాలని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చారు. త్వరలో పార్లమెంటులా అసెంబ్లీ మారాలని అయన అన్నారు.
బుధవారం నాడు అయన అసెంబ్లీ, మండలిని నడుస్తూ తిరిగి పరిశీలించారు. అసెంబ్లీ,మండలి కలిపి ఒకే బిట్ లా కనిపించేలా మార్పులు చేయాలి. పార్కింగ్,ల్యాండ్ స్కెప్ ల కోసం త్వరలో చర్యలుతీసుకోవాలంటూ అధికారులకు ఆదేశాలిచ్చారు. పార్లమెంటును దృష్టిలో పెట్టుకుని పనులు చేయాలి. పార్లమెంటు వద్ద విజయ్ చౌక్ లా మార్పులు చేయాలి అంటూ రేవంత్ ఆదేశాలిచ్చారు.